icon icon icon
icon icon icon

సీఎంపై ఎన్నికల ప్రధానాధికారికి భాజపా ఫిర్యాదు

ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాజపా ఎన్నికల విభాగం లీగల్‌ సెల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

Published : 04 May 2024 05:42 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాజపా ఎన్నికల విభాగం లీగల్‌ సెల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత కొద్దిరోజులుగా రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని భాజపా రద్దు చేయబోతోందని, ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ.. మోదీ, అమిత్‌షాల మాటలను వక్రీకరిస్తున్నారన్నారు. దిల్లీ సైబర్‌ క్రైం పోలీసులు నోటీసులిచ్చి కేసులు నమోదు చేయగా, భాజపాయే దిల్లీ పోలీసులతో కేసు పెట్టించినట్లు రేవంత్‌ ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ పోలీసులు సైతం కేసులు నమోదు చేయడంపై ఏమంటారని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img