icon icon icon
icon icon icon

భాజపాపై పోరాటంలో కమ్యూనిస్టులే ముందు: మంత్రి ఉత్తమ్‌

కాంగ్రెస్‌, సీపీఐలు సహజ మిత్రులని, రెండు పార్టీలు నిరుపేదల అభివృద్ధికి కృషి చేసేవే అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నాలుగు శాసనసభ నియోజకవర్గాల (సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ) స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

Published : 04 May 2024 05:45 IST

హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌, సీపీఐలు సహజ మిత్రులని, రెండు పార్టీలు నిరుపేదల అభివృద్ధికి కృషి చేసేవే అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నాలుగు శాసనసభ నియోజకవర్గాల (సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ) స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఇండియా కూటమి గెలవబోతుందని, రాహుల్‌ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా భాజపాకు వ్యతిరేకంగా పోరాడే వారిలో కమ్యూనిస్టులే ముందుంటారని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి మతపరమైన అంశాలే తప్పా.. రాష్ట్రానికి, దేశానికి ఏం చేశారనేది చెప్పలేక పోయారని విమర్శించారు. మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమాజం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం భాజపాను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భారాస పని అయిపోయిందని, ఆ పార్టీకి ప్రజలు స్వస్తి పలికారన్నారు. ఆ పార్టీ నుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఇంకా 20 మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తరవాత భారాస మనుగడ ప్రశ్నార్థకమేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img