icon icon icon
icon icon icon

హామీలు అమలు చేయలేకే తప్పుడు ప్రచారం: లక్ష్మణ్‌

సమాజంలో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి కుతంత్రాలకు తెరతీశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు.

Updated : 04 May 2024 06:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: సమాజంలో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి కుతంత్రాలకు తెరతీశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ఓట్ల కోసం భాజపాపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చేస్తుందంటూ కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ పార్టీయే వ్యతిరేకమన్నారు. భాజపా గాడిద గుడ్డు ఇచ్చిందని ప్రస్తావిస్తున్నారని, వాస్తవంగా కాంగ్రెస్‌కు పాము గుడ్డు గుర్తు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఫేక్‌ వీడియోలు సృష్టించిన వారిని భాజపా వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్‌రెడ్డికి ప్రధానిని విమర్శించే హక్కు లేదన్నారు. మద్యం వ్యవహారంలో భారాసతో కుమ్మక్కైన ఆప్‌తో కాంగ్రెస్‌ దోస్తీ చేస్తోందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌ పగటి కలలు కంటున్నారని, హైదరాబాద్‌ యూటీ కావాలని కోరుకుంటున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img