icon icon icon
icon icon icon

సీఎం నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం

తనపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్‌ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పటాన్‌చెరులో మాట్లాడారు.

Published : 04 May 2024 05:46 IST

మెదక్‌ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: తనపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్‌ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పటాన్‌చెరులో మాట్లాడారు. ‘నేను ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశా. పార్టీలకతీతంగా నన్ను, నేను అందించిన సేవలను సీఎంలు మెచ్చుకున్నారు. నేను ఎక్కడా బాధ్యతారాహిత్యంగా మాట్లాడలేదు. మల్లన్నసాగర్‌ గురించి నాపై లేనిపోని ఆరోపణలు చేశారు. మల్లన్నసాగర్‌ ప్రభావిత ప్రాంత ప్రజలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సాయం అందించాం. అందుకే వారు అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు భారీగా ఓట్లు వేశారు. మెదక్‌ గడ్డపై మా గెలుపు ఖాయం. వ్యక్తిగతంగా నాపై చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయి. నన్ను, నా కుటుంబాన్ని అవమానపరచవద్దు’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు. సమావేశంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img