icon icon icon
icon icon icon

నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డి

నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించారు.

Published : 04 May 2024 05:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ ఎన్నిక నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌ గ్రామానికి చెందిన రాకేశ్‌రెడ్డి బిట్స్‌పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌(ఎంఎంఎస్‌), మాస్టర్స్‌ ఇన్‌ ఫైనాన్స్‌(ఎంఎస్‌) పూర్తి చేశారు. రాజకీయాలపై ఆసక్తితో 2013లో భాజపాలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ పశ్చిమ స్థానానికి భాజపా టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. తదనంతర పరిణామాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారాసలో చేరారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కోసం పార్టీ నుంచి పలువురు పోటీపడినా.. భారాస అధిష్ఠానం రాకేశ్‌రెడ్డి అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img