icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

కాంగ్రెస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుపై శుక్రవారం రెండో ఠాణాలో కేసు నమోదైందని సీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. రాజేందర్‌రావు వ్యక్తిగత ఫేస్‌బుక్‌ ఖాతాలో భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అనని మాటలు అన్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించారంటూ ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కొట్టె మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు.

Published : 04 May 2024 06:06 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుపై శుక్రవారం రెండో ఠాణాలో కేసు నమోదైందని సీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. రాజేందర్‌రావు వ్యక్తిగత ఫేస్‌బుక్‌ ఖాతాలో భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అనని మాటలు అన్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించారంటూ ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కొట్టె మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓ పార్టీ అభ్యర్థి మరో పార్టీ అభ్యర్థిపై ఇలా తప్పుడు వీడియోలు సృష్టించారని, అవి విద్వేషాలు రెచ్చగొట్టేలా, గౌరవ ప్రతిష్ఠలు దెబ్బతినే విధంగా ఉన్నాయన్నారు. మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు వెలిచాల రాజేెందర్‌రావుపై కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img