icon icon icon
icon icon icon

రాహుల్‌ ప్రధాని కావాలి: దీపా దాస్‌మున్షీ

రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ విమర్శించారు. దేశం బాగుండాలంటే రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

Published : 04 May 2024 06:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ విమర్శించారు. దేశం బాగుండాలంటే రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ తరఫున తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. దేశ ప్రజలకు న్యాయం కోసం రాహుల్‌ జోడో యాత్ర, న్యాయ యాత్ర చేయడంతో మోదీకి భయం పట్టుకుందన్నారు. తెలంగాణలో 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. భారాస పాలనతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే పాలనను గాడిలో పెట్టామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని 23 అంశాలతో తెలంగాణకు మ్యానిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img