icon icon icon
icon icon icon

ఆదిలాబాద్‌ నేతల చేరిక నిలిపివేత: జగ్గారెడ్డి

ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఆదిలాబాద్‌ జిల్లా నాయకుల చేరికలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పీసీసీ చేరికల కమిటీ సభ్యుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 04 May 2024 06:07 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఆదిలాబాద్‌ జిల్లా నాయకుల చేరికలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పీసీసీ చేరికల కమిటీ సభ్యుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు కాకుండా కొత్తగా పార్టీలో చేరిన ఎన్నారై కంది శ్రీనివాస్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడంతో ఆ సమయంలో ఆదిలాబాద్‌ డీసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్న సాజిద్‌ఖాన్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్‌ సుజాత, సీనియర్‌ నాయకులు సంజీవరెడ్డిలు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోకి రావాలని ఆసక్తి చూపే వారిని చేర్చుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇటీవల ఆదేశించింది. దీంతో వీరు ముగ్గురు గత నెల 30న గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. వీరి చేరికలను కంది శ్రీనివాస్‌రెడ్డి వర్గం వ్యతిరేకిస్తూ నిరసనలకూ దిగింది. పరిస్థితి తీవ్రతను గుర్తించి వారి చేరికలను తాత్కాలికంగా నిలిపివేయాలని దీపా దాస్‌మున్షీ ఆదేశించినట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img