icon icon icon
icon icon icon

100 సార్లకు పైగా రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్‌

రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని.. ప్రధాని మోదీ బతికున్నంత వరకు కొనసాగుతాయని ప్రకటించినా విషం చిమ్ముతున్నారని.. మళ్లీ ఆ ప్రస్తావన తెస్తే ప్రజలు తరిమికొట్టాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కోరారు.

Published : 05 May 2024 05:35 IST

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌

కరీంనగర్‌ కొత్తపల్లి, న్యూస్‌టుడే: రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని.. ప్రధాని మోదీ బతికున్నంత వరకు కొనసాగుతాయని ప్రకటించినా విషం చిమ్ముతున్నారని.. మళ్లీ ఆ ప్రస్తావన తెస్తే ప్రజలు తరిమికొట్టాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కోరారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి పట్టణంలో శనివారం రాత్రి జరిగిన స్ట్రీట్‌కార్నర్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో వందసార్లకుపైగా రాజ్యాంగాన్ని మార్చిందని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఫోన్‌ ట్యాపింగ్‌ సొమ్ముతో కరీంనగర్‌లోని కార్పొరేటర్లను కొంటోందని ఆరోపించారు. ఒక్కో కార్పొరేటర్‌కు రూ.20 లక్షలు ఇస్తే.. ఇందులో రూ.5 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు చర్చ జరుగుతోందన్నారు. తక్షణమే బ్యాంకు లావాదేవీలపై విచారణ చేపట్టడంతోపాటు డబ్బు తీసుకున్న, ఇచ్చిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా రాజ్యాంగంలో చేర్చిన ‘లౌకిక’ అనే పదాన్ని తీసేస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాముడిని, రాముడి అక్షింతలను హేళన చేయడమంటే రాజ్యాంగాన్ని, దేవుడిని కొలిచే కోట్ల మంది భక్తులను అవమానపరిచినట్లేనన్నారు. కేసీఆర్‌ ఇతర వర్గాల జనాల ముందు దేవుడి తీర్థ ప్రసాదాలను, అక్షింతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img