icon icon icon
icon icon icon

ప్రజ్వల్‌ రేవణ్ణను అరెస్టు చేయాలి

మహిళలపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక జేడీఎస్‌ నేత ప్రజ్వల్‌ రేవణ్ణను వెంటనే అరెస్టు చేయాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్‌ చేశారు.

Updated : 06 May 2024 06:38 IST

మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: మహిళలపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక జేడీఎస్‌ నేత ప్రజ్వల్‌ రేవణ్ణను వెంటనే అరెస్టు చేయాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్‌ చేశారు. రేవణ్ణకు వ్యతిరేకంగా ఆదివారం మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ.. కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్నందువల్లే లైంగిక వేధింపుల అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌ మాట్లాడటం లేదని విమర్శించారు. దీనిపై స్పందించకపోతే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు మహిళలు ఓటేయరని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img