icon icon icon
icon icon icon

సీఎం పదవికి రేవంత్‌ అనర్హుడు: డీకే అరుణ

సీఎం పదవికి రేవంత్‌రెడ్డి అనర్హుడని భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 06 May 2024 03:33 IST

జడ్చర్ల పట్టణం, న్యూస్‌టుడే: సీఎం పదవికి రేవంత్‌రెడ్డి అనర్హుడని భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సీఎంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి గాలిలో గెలిచి సీఎం అయ్యారని, పాలనానుభవం లేదని, ఆయన ప్రజల గోడు పట్టించుకున్నది లేదని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో రైతుల సాగునీటి సమస్యలపై తాను పోరాటం చేసి పరిష్కారానికి కృషి చేశానన్నారు. పాలమూరు జిల్లాకు మీరు ఏం చేశారని సీఎంను ప్రశ్నిస్తే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిగత విమర్శలు చేయటంతో పాటు వాట్సప్‌లో పోస్టులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img