icon icon icon
icon icon icon

‘ఇండియా’ కూటమికే బీసీల మద్దతు: జాజుల

కేంద్రంలో పదేళ్ల భాజపా పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు.

Published : 06 May 2024 03:33 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్రంలో పదేళ్ల భాజపా పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓబీసీలు కోరుకుంటున్న అంశాలే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమికి బీసీల మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన బీసీ నాయకులతో ‘బీసీల రాజకీయ మేధోమథనం’ పేరిట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో తొలిసారి ఓబీసీ ప్రధానిగా ఉండటంతో సమస్యలన్నీ తీరుతాయనుకుంటే తీవ్ర నిర్లక్ష్యం చేశారన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే తొలి సంతకం సామాజిక ఆర్థిక సమగ్ర కులగణన అంశంపైనే ఉంటుందని ప్రకటించడంతో పాటు ఇతర హామీలు మ్యానిఫెస్టోలో చేర్చినందున బీసీలంతా అండగా నిలవాలన్నారు. బైరి రవికృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్‌ ముదిరాజు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డా.చిరంజీవులు, చిన్న శ్రీశైలంయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img