icon icon icon
icon icon icon

జిల్లాల రద్దు కాదు.. కమిషన్‌ ఏర్పాటు చేస్తాం: మంత్రి తుమ్మల

రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని, న్యాయబద్ధమైన కమిషన్‌ వేసి దానిపై నిర్ణయం తీసుకుంటామంటూ సీఎం చెప్పారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Updated : 06 May 2024 06:17 IST

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని, న్యాయబద్ధమైన కమిషన్‌ వేసి దానిపై నిర్ణయం తీసుకుంటామంటూ సీఎం చెప్పారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేసీఆర్‌ ఎక్కడకు వెళ్లినా సీఎం రేవంత్‌రెడ్డి మీ జిల్లాను రద్దు చేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, అన్ని జిల్లాలను రద్దు చేస్తే పాలన నడుస్తుందా? అని తుమ్మల ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌కు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం మహబూబాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో మంత్రి మాట్లాడారు..అవాస్తవాలు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్‌ చూస్తున్నారని, ఆయనను ప్రజలు నమ్మట్లేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు వామపక్షాలు సహకారం అందించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డోర్నకల్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్‌, మురళీనాయక్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి, భరత్‌చంద్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుంకరి వీరయ్య, జి.నాగయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img