icon icon icon
icon icon icon

భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్లు కోల్పోతాం

లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు ఓటేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కోల్పోతామని భారాస నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

Published : 06 May 2024 03:34 IST

భారాస నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు ఓటేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కోల్పోతామని భారాస నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో ఆదివారం మాదిగల రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మగౌరవ సభకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో హాజరై మాట్లాడారు. దేశంలో భాజపా మతతత్వ రాజకీయాలు చేయడమే కాకుండా, భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ఎస్సీలకు కేటాయించిన మూడు పార్లమెంట్‌ స్థానాల్లో మాదిగలకు ఒక్క స్థానం కూడా కేటాయించలేదని, మాదిగలను ఓట్లడిగే నైతిక హక్కు సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు. స్థానికేతరుడైన కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లురవి నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. కేవలం పదవి కోసం పోటీ చేస్తున్న ఆయనకు కాంగ్రెస్‌ నేతలు మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. మోదీ కేవలం మాదిగల ఓట్ల కోసం మందకృష్ణతో కలిసి ఎస్సీ వర్గీకరణపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img