icon icon icon
icon icon icon

పాత, కొత్త నాయకుల సమన్వయంపై దృష్టి పెట్టాలి

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా పాత, కొత్త నాయకులను సమన్వయం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ సూచించింది.

Published : 06 May 2024 03:36 IST

పార్లమెంటు సమన్వయకర్తలకు పీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ సూచన

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా పాత, కొత్త నాయకులను సమన్వయం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ సూచించింది. ఇది సాధ్యం కాని పక్షంలో వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ నియమించిన 49 మంది పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలతో కమిటీ ఆదివారం గాంధీభవన్‌లో సమావేశమైంది. సభ్యులు దిలీప్‌కుమార్‌, వినోద్‌రెడ్డి, కత్తి వెంకటస్వామి, దివ్యవాణి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలింగ్‌కు తక్కువ సమయం ఉన్నందున తక్షణం క్షేత్రస్థాయిలోకి వెళ్లాలన్నారు. ఎక్కడైనా పార్టీ బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తే కమిటీ దృష్టికి తీసుకురావాలని, నష్ట నివారణ చర్యలు చేపడతామని తెలిపారు. భారాస, భాజపా మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్నాయని, అలాంటి సమస్య ఎక్కడెక్కడ ఉందో తెలియజేస్తే డీజీపీ, ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సీపీఐ, సీపీఎం, తెజస నాయకులను సమన్వయం చేసుకోవాలని, ఆయా పార్టీల ఓటు కాంగ్రెస్‌కు బదిలీ అయ్యేలా చూడాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img