icon icon icon
icon icon icon

26 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి

పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవుతున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది.

Published : 06 May 2024 03:37 IST

పోలింగ్‌ శాతం పెరిగేలా అధికారుల చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవుతున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. తొలి రెండు దశల్లో దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన నగరాల్లో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవడంపై ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. మిగతా దశల్లో ఓటింగ్‌ పెరిగేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాలని సూచించింది. 2018 నుంచి జరిగిన మూడు ఎన్నికల్లో రాష్ట్రంలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో సగటు పోలింగ్‌ శాతం 54.48గా నమోదైంది. 2019లో సగటున 48.56 శాతం పోలింగ్‌ మాత్రమే జరిగింది. మిగిలిన 13 లోక్‌సభ నియోజకవర్గాల సగటు 65 శాతం వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

పోలింగ్‌ తక్కువగా నమోదైన 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింహభాగం నగర, పట్టణ ప్రాంతాల్లోనివే. ఆయాచోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎండవేడిని తట్టుకునేలా సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వరుసలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు రూపొందించిన ‘క్యూ యాప్‌’పై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ‘ఈనాడు’తో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img