icon icon icon
icon icon icon

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 32,331 మంది ఓటు

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోస్టల్‌బ్యాలెట్‌ ద్వారా శనివారం రాత్రివరకు 32,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Published : 06 May 2024 03:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోస్టల్‌బ్యాలెట్‌ ద్వారా శనివారం రాత్రివరకు 32,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో దివ్యాంగులు, 80ఏళ్లు దాటిన వృద్ధులు 23,247 మంది ఉండగా..అందులో 15,637 మంది హోంకేటగిరీలో ఓటు వేశారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ చిత్రాలు బహిర్గతం.. ముగ్గురిపై కేసు

వీర్నపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రం చిత్రాలను బహిర్గతం చేసిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వీర్నపల్లి ఎస్సై రమేశ్‌ ఆదివారం రాత్రి తెలిపారు. దిల్లీలో పనిచేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన జవాన్‌ పార్లమెంటు ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుని.. ఆ చిత్రాలను ఇతరులకు పంపారని చెప్పారు. వాటిని ఎర్రగడ్డ తండాకు చెందిన భానోత్‌ శ్రీనివాస్‌, వాయిని సాయిలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారన్నారు. ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇన్‌ఛార్జి వెంకన్న ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img