icon icon icon
icon icon icon

మిగిలింది 5 రోజులు.. కాంగ్రెస్‌ ప్రచారం ఉద్ధృతం

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజులే సమయం ఉండటంతో కాంగ్రెస్‌ ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఈనెల 9న అగ్రనేత రాహుల్‌గాంధీ, 10న ప్రియాంకాగాంధీ ప్రచారంలో పాల్గొనేలా రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రణాళిక సిద్ధం చేసింది.

Published : 07 May 2024 03:26 IST

 9న రాహుల్‌ గాంధీ, 10న ప్రియాంకా గాంధీ సభలు  
మిగిలిన రోజుల్లో సీఎం రేవంత్‌ కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోలు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజులే సమయం ఉండటంతో కాంగ్రెస్‌ ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఈనెల 9న అగ్రనేత రాహుల్‌గాంధీ, 10న ప్రియాంకాగాంధీ ప్రచారంలో పాల్గొనేలా రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. మిగతా రోజుల్లో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ సోమవారం విడుదల చేసింది.

  •  రాహుల్‌గాంధీ ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్‌లో నిర్వహించే జనజాతర సభకు హాజరవుతారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు.
  • ప్రియాంకాగాంధీ ఈనెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో జనజాతర సభలో, మధ్యాహ్నం ఒంటిగంటకు తాండూరు జనజాతర సభకు హాజరవుతారు. అదేరోజు రాత్రి 7 గంటలకు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లలో, రాత్రి 8.45 గంటలకు మణికొండ కార్నర్‌ మీటింగ్‌లో ఆమె మాట్లాడతారు.
  • సీఎం రేవంత్‌రెడ్డి 7న సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌ జనజాతర సభ, 6.30కు వరంగల్‌ ఈస్ట్‌ రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌, రాత్రి 7.45 గంటలకు వరంగల్‌ వెస్ట్‌ రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. 8న సాయంత్రం 5 గంటలకు ఆర్మూర్‌ కార్నర్‌ మీటింగ్‌, రాత్రి 7 గంటలకు నిజామాబాద్‌ రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. ప్రచారానికి చివరి రోజు 11న ఉదయం 10 గంటలకు పటాన్‌చెరు కార్నర్‌ మీటింగ్‌లో, మధ్యాహ్నం 3 గంటలకు మక్తల్‌ జనజాతర సభలో పాల్గొంటారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img