icon icon icon
icon icon icon

ఎన్నికల రోజు ఓటర్లకు ర్యాపిడో ఉచిత రైడ్‌

ప్రజాస్వామ్య దేశంలో ఓటు.. హక్కు మాత్రమే కాదు, బాధ్యతని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు.

Published : 07 May 2024 05:21 IST

హైదరాబాద్‌లో 60-65 శాతం పోలింగ్‌ జరిగేలా చూద్దాం: వికాస్‌రాజ్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య దేశంలో ఓటు.. హక్కు మాత్రమే కాదు, బాధ్యతని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు. ప్రతి ఓటరు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం, ర్యాపిడోల ఆధ్వర్యంలో సాధారణ ఎన్నికలు- 2024లో ఉచిత రైడ్‌లను అందించే ‘సవారీ బాధ్యత’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ.. పోలింగ్‌ రోజైన మే 13న ఓటర్లకు రవాణా సమస్య లేకుండా ర్యాపిడో ఉచిత సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రతిసారి హైదరాబాద్‌లో పోలింగ్‌ 50 శాతం దాటడం లేదని, ఈసారి 60- 65 శాతం దాటేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగర పోలీసు కమిషనర్‌ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పోలింగ్‌ రోజున అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తాయని, అలాంటి వారికి ర్యాపిడోవారు సహకరించొద్దన్నారు. ర్యాపిడో ప్రతినిధి రోహిత్‌ మాట్లాడుతూ.. ఎన్నికల రోజున ఓటర్లు ‘వోట్‌నౌ’ కోడ్‌ను ఉపయోగించి ర్యాపిడో యాప్‌ ద్వారా ఉచిత రైడ్‌లను పొందొచ్చని చెప్పారు. దివ్యాంగులు, వయోధికులకు హైదరాబాద్‌లో ప్రత్యేక సేవలు ఉంటాయన్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌తోపాటు ర్యాపిడో అందుబాటులో ఉన్న నగరాల్లో ఈ సేవలందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img