icon icon icon
icon icon icon

మత విద్వేషాలు రగిల్చి లబ్ధి పొందేందుకు భాజపా యత్నం

మత విద్వేషాలు రగిల్చి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఏఐసీసీ మీడియా కోఆర్డినేటర్‌ అద్నాన్‌ అర్జాఫ్‌ విమర్శించారు.

Published : 07 May 2024 05:23 IST

ఏఐసీసీ మీడియా కోఆర్డినేటర్‌ అద్నాన్‌ అర్జాఫ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: మత విద్వేషాలు రగిల్చి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఏఐసీసీ మీడియా కోఆర్డినేటర్‌ అద్నాన్‌ అర్జాఫ్‌ విమర్శించారు. తెలంగాణ మీడియా కోఆర్డినేటర్‌ సుజాతాపాల్‌, సీనియర్‌ నాయకులు ఖలీల్‌ ఉర్‌ రహమాన్‌లతో కలిసి ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 400 ఎంపీ సీట్లు గెలుస్తామని భాజపా అంటోంది..అదే జరిగితే ఆ పార్టీ రహస్య ఎజెండా అమలు చేస్తుందన్నారు. ప్రధాని మోదీ, అమిత్‌షాలు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మణిపుర్‌ ఘటనపై స్పందించని మోదీ పాకిస్థాన్‌ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img