icon icon icon
icon icon icon

ప్రజ్వల్‌ రేవణ్ణను అరెస్టు చేయాలి

భాజపా నేతలకు దమ్ముంటే లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక జేడీఎస్‌ నేత, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను అరెస్టు చేయాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి డిమాండ్‌ చేశారు.

Published : 07 May 2024 05:24 IST

ఎంపీ రేణుకా చౌదరి డిమాండ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భాజపా నేతలకు దమ్ముంటే లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక జేడీఎస్‌ నేత, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను అరెస్టు చేయాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి డిమాండ్‌ చేశారు. నాయకులు సుజాతాపాల్‌, సామ రాంమోహన్‌రెడ్డిలతో కలిసి ఆమె సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భాజపా నేతలు, ఆ కూటమిలోని పార్టీల నాయకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నా చర్యలు లేవని విమర్శించారు. ముస్లింలపై భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. దిల్లీ పోలీసులు ఏ హక్కుతో గాంధీభవన్‌కు వచ్చి మా వాళ్లపై కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు.

ఎంపీ అర్వింద్‌పై పీసీసీ ఎన్నారై సెల్‌ ఛార్జిషీట్‌

భాజపా ఎంపీ, ఆ పార్టీ నిజామాబాద్‌ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌పై పీసీసీ ఎన్నారై సెల్‌ ‘గల్ఫ్‌ కార్మిక ద్రోహి- గప్పాల అర్వింద్‌’ పేరిట పోస్టర్‌ రూపంలో ఛార్జిషీట్‌ రూపొందించింది. ఈ పోస్టర్‌ను ఎంపీ, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సుజాతాపాల్‌, సామ రాంమోహన్‌రెడ్డి, గంపా వేణుగోపాల్‌, భీమ్‌రెడ్డి, నంగి దేవేందర్‌రెడ్డి, మునీర్‌ తదితరులు పాల్గొన్నారు. 2019లో మాయమాటలతో నిజామాబాద్‌ ఎంపీగా గెలిచిన అర్వింద్‌ గల్ఫ్‌ కార్మికులను మోసం చేశారని వారు ఆరోపించారు. ఛార్జిషీట్‌లోని నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే ఆయనకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img