icon icon icon
icon icon icon

కేంద్రంలో కాంగ్రెస్‌ గెలిస్తే ఎన్నారై మంత్రిత్వ శాఖ ఏర్పాటు

కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ఎన్నారై మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌(ఐఓసీ) కార్యదర్శి డాక్టర్‌ ఆరతి కృష్ణన్‌ తెలిపారు.

Published : 07 May 2024 05:32 IST

ఐఓసీ కార్యదర్శి డా.ఆరతి కృష్ణన్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ఎన్నారై మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌(ఐఓసీ) కార్యదర్శి డాక్టర్‌ ఆరతి కృష్ణన్‌ తెలిపారు. ఐఓసీ నాయకులు మహీందర్‌సింగ్‌, ప్రదీప్‌ సామల, గంపా వేణుగోపాల్‌, రాజేశ్వర్‌రెడ్డి, భీమ్‌రెడ్డి తదితరులతో కలిసి ఆమె సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నారైల సమస్యలను మోదీ సర్కార్‌ పట్టించుకోలేదని, ప్రత్యేకంగా ఎన్నారై మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర, న్యాయ్‌ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. ఇక్కడి నుంచి ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారు సైతం పార్లమెంట్‌ ఎన్నికల్లో పాల్గొనాలని, కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని కోరారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోందన్నారు. గంపా వేణుగోపాల్‌, రాజేశ్వర్‌రెడ్డి, భీమ్‌రెడ్డిలు మాట్లాడుతూ..కేసీఆర్‌ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతుల సిబిల్‌ స్కోర్‌ పడిపోయిందని, దీంతో ఎన్నారెలౖ పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే సిబిల్‌ స్కోర్‌ పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img