icon icon icon
icon icon icon

ఆరు గ్యారంటీలు అమలైన గ్రామాల్లో ఓట్లడగం: హరీశ్‌

‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అబద్ధాలు చెబుతున్నారు.

Published : 07 May 2024 05:35 IST

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అబద్ధాలు చెబుతున్నారు. అవి నిజంగా అమలైన గ్రామాల్లో భారాస ఓట్లు అడగదు. అమలు కాని గ్రామాల్లో కాంగ్రెస్‌ అడగవద్దు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాలు విసిరారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో బుధవారం మాజీ సీఎం కేసీఆర్‌ రోడ్‌షో ఉన్న నేపథ్యంలో సోమవారం ముఖ్యనేతలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో, అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘ప్రతి ఇంట్లో మహిళకు రూ.2,500 ఎక్కడ ఇచ్చారో చెప్పాలి. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అవాస్తవాలు చెప్పినందుకు రాహుల్‌గాంధీ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల రద్దు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. మెదక్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికలకు ముందు ఫేక్‌ వీడియోలతో గిమ్మిక్కులు చేసి ఓట్లు పొందాలని చూస్తున్నారు. ఈ విషయమై మాకు పక్కా సమాచారం ఉంది. గతంలో దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఇలానే చేసి లబ్ధి పొందారు. రఘునందన్‌ చేస్తున్న కుట్రలపై పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదు చేయగా.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఓ యువమోర్చా నాయకుడిపై కేసు నమోదైంది’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img