icon icon icon
icon icon icon

ఓటమి భయంతోనే మోదీ వ్యాఖ్యలు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా సగానికిపైగా సీట్లలో ఓడిపోతోందని తెలిసి మోదీకి భయం పట్టుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Published : 07 May 2024 05:38 IST

భగత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా సగానికిపైగా సీట్లలో ఓడిపోతోందని తెలిసి మోదీకి భయం పట్టుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని బద్ధం ఎల్లారెడ్డిభవన్‌లో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఓటమి భయంతోనే మోదీ.. ఇండియా కూటమి గెలిస్తే ముస్లింలు హిందువులపై దాడి చేస్తారంటూ, సంపదను దోచుకుంటారని మాట్లాడుతున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా?’ అని ప్రశ్నించారు. ‘భాజపాను తిరిగి గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తానంటూ ప్రకటిస్తున్నారు. రూ.100 కోట్ల విషయంలో దిల్లీ సీఎంను, రూ.2 వేల కోట్ల వ్యవహారంలో ఝార్ఖండ్‌ సీఎంని జైలు పాలు చేసిన మోదీ రూ.45 వేల కోట్ల కుంభకోణం చేసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై పదుల సంఖ్యలో కేసులున్నా.. ఏం చేయకపోవడంతో ఆయన పదేళ్లుగా బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. తెలంగాణలో సీపీఐ పోటీ చేయాలనుకున్నా అవకాశం లభించలేదు. భాజపాను ఓడించడానికి ఇండియా కూటమిలో భాగస్వాములయ్యాం. తెలంగాణలో కాంగ్రెస్‌, భాజపా మధ్యనే పోటీ ఉంది. భారాస పనైపోయింది’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img