icon icon icon
icon icon icon

బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించే పార్టీలకే మద్దతు: ఆర్‌.కృష్ణయ్య

బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించే రాజకీయ పార్టీలకే లోక్‌సభ ఎన్నికల్లో మద్దతిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.

Published : 08 May 2024 04:31 IST

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించే రాజకీయ పార్టీలకే లోక్‌సభ ఎన్నికల్లో మద్దతిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బీసీ అసోసియేషన్‌ సంఘాల సంయుక్తాధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో జరిగిన బీసీల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీలకు రాజకీయ వాటా ఇవ్వని పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడంతోపాటు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, కులగణన చేపడతామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని చెప్పారు. ఈ విషయమై ప్రధాని మోదీ నేటికీ స్పష్టత ఇవ్వకపోవడం తగదని కృష్ణయ్య పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ హామీ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తెలిపారు. సమావేశంలో బీసీ సంఘాల ప్రతినిధులు శారదాగౌడ్‌, నీల వెంకటేశ్‌, భరత్‌కుమార్‌, సత్యం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img