icon icon icon
icon icon icon

రిజర్వేషన్లపై నకిలీ వీడియోల వెనక సీఎం రేవంత్‌రెడ్డి

రిజర్వేషన్ల విషయంలో మార్ఫింగ్‌ వీడియోలతో భాజపాను అభాసుపాలు చేయాలని కొంతమంది చూస్తున్నారని.. అలాంటి వారికి ఓట్ల రూపంలో ప్రజలే గుణపాఠం చెబుతారు అని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు.

Updated : 08 May 2024 04:35 IST

బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య

మారేడుపల్లి, బర్కత్‌పుర, నారాయణగూడ, న్యూస్‌టుడే: రిజర్వేషన్ల విషయంలో మార్ఫింగ్‌ వీడియోలతో భాజపాను అభాసుపాలు చేయాలని కొంతమంది చూస్తున్నారని.. అలాంటి వారికి ఓట్ల రూపంలో ప్రజలే గుణపాఠం చెబుతారు అని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. ఈ నకిలీ వీడియోల వెనక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఇలాంటి వారిని చట్టం ఎప్పటికైనా శిక్షిస్తుందన్నారు. తేజస్వీ సూర్య మంగళవారం హైదరాబాద్‌ మహేంద్రహిల్స్‌లో బీజేవైఎం అధికార ప్రతినిధి మల్క యశస్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ప్రజ్వల్‌ రేవణ్ణ తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వీబీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ స్మారక విద్యా సంస్థల ప్రాంగణంలో ‘ఓటు ప్రచారం.. సంగీత కచేరీ’ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. యువతతో ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img