icon icon icon
icon icon icon

పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారు?

‘‘పిరమైన ప్రధాని నరేంద్ర మోదీజీ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి. దశాబ్ద కాలంలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లడగండి’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ‘ఎక్స్‌’ వేదికగా మంగళవారం ప్రధానిని ఉద్దేశించి.. కేటీఆర్‌ పలు ప్రశ్నలు సంధించారు.

Published : 08 May 2024 04:38 IST

అది చెప్పి ఓట్లు అడగండి
‘ఎక్స్‌’లో ప్రధాని మోదీని ప్రశ్నించిన కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘పిరమైన ప్రధాని నరేంద్ర మోదీజీ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి. దశాబ్ద కాలంలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లడగండి’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ‘ఎక్స్‌’ వేదికగా మంగళవారం ప్రధానిని ఉద్దేశించి.. కేటీఆర్‌ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రధానిగా పదేళ్లు గడిచినా.. ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకూ ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పండి? మా యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారు? మా ఏజెన్సీ బిడ్డలకు బతుకుదెరువునిచ్చే బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారు? ఐటీఐఆర్‌ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారు? తెలంగాణకు నవోదయ, మెడికల్‌, నర్సింగ్‌ కళాశాల, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఐఐఎం, ఐసర్‌, ఎన్‌ఐడీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు? సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని.. మా రైతులపై ఎందుకు పెత్తనం చేస్తున్నారు? చేనేత రంగంపై జీఎస్టీ వేసి మగ్గానికి ఎందుకు మరణశాసనం రాశారు? పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు ఎందుకు తగ్గించలేదు? మీ పాలనలో పదేళ్లు గడిచినా.. ఇంకా ఉచిత రేషన్‌ పథకం కింద 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారు? రెచ్చగొట్టే రాజకీయాలకు ఇక్కడ ఓట్లు పడవు. ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డా’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img