icon icon icon
icon icon icon

రఘురాంరెడ్డికి ఓటేయండి

అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు.. ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు.. అలాంటి రఘురాంరెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీనటుడు విక్టరీ వెంకటేశ్‌ పిలుపునిచ్చారు.

Published : 08 May 2024 04:38 IST

ఖమ్మంలో సినీ నటుడు వెంకటేశ్‌ ప్రచారం

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు.. ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు.. అలాంటి రఘురాంరెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీనటుడు విక్టరీ వెంకటేశ్‌ పిలుపునిచ్చారు. ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ‘అమ్మా, అక్కా, చెల్లి, తాతా, బాబూ, తమ్ముడూ ఈవీఎంలో మూడో నంబర్‌ గుర్తుందా? మే 13న పోలింగ్‌.. ఆ రోజు మీరంతా హస్తం గుర్తు బటన్‌ నొక్కండి’ అని అభ్యర్థించారు. ‘ఓటేయడం మనందరి బాధ్యత.. కమాన్‌ ఖమ్మం’ అంటూ ఓటర్లను ఉత్సాహపరిచారు. తొలుత అభిమానులు గజమాలతో వెంకటేశ్‌ను సత్కరించారు. అనంతరం మయూరి సెంటర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ వైరారోడ్డు మీదుగా జడ్పీ సెంటర్‌, ఇల్లెందు క్రాస్‌రోడ్డు వరకు సుమారు రెండు గంటల పాటు సాగింది. ర్యాలీకి వెంకటేశ్‌ అభిమానులు, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, తుమ్మల యుగంధర్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img