icon icon icon
icon icon icon

నేడు మోదీ, రేపు అమిత్‌షా సభలు

ప్రధాని మోదీ బుధవారం, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురువారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మోదీ మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుని రాజ్‌భవన్‌లో బస చేశారు.

Published : 08 May 2024 04:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని మోదీ బుధవారం, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురువారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మోదీ మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుని రాజ్‌భవన్‌లో బస చేశారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వేములవాడకు చేరుకుంటారు. అక్కడి రాజరాజేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం వేములవాడలో భాజపా బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వరంగల్‌ చేరుకుని.. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అమిత్‌షా గురువారం ఉదయం భువనగిరిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆయన బుధవారం రాత్రే హైదరాబాద్‌ చేరుకోనున్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం వరంగల్‌తో పాటు జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని బాన్సువాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img