icon icon icon
icon icon icon

ప్రియాంకాగాంధీ పర్యటన 11కు వాయిదా

కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచార పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ఆమె ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 10న కాకుండా 11న తెలంగాణకు వస్తున్నారు.

Published : 08 May 2024 04:40 IST

10న నల్గొండ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచార పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ఆమె ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 10న కాకుండా 11న తెలంగాణకు వస్తున్నారు. ఆ రోజు ఉదయం కామారెడ్డి జనజాతర సభలో పాల్గొంటారు. అనంతరం కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మణికొండలలో రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లలో ఆమె పాల్గొంటారని ప్రాథమిక సమాచారం. 10న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన ఉండడంతో ప్రియాంక ప్రచార షెడ్యూలులో మార్పు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 10న రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం నల్గొండలో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img