icon icon icon
icon icon icon

దేశ సుస్థిరతకు మోదీ నాయకత్వం అవసరం

దేశ సుస్థిరతకు, ప్రజాసంక్షేమానికి కేంద్రంలో మోదీ నాయకత్వం అవసరమని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 08 May 2024 04:41 IST

కేంద్ర మంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి

బంజారాహిల్స్‌, రాంనగర్‌- న్యూస్‌టుడే: దేశ సుస్థిరతకు, ప్రజాసంక్షేమానికి కేంద్రంలో మోదీ నాయకత్వం అవసరమని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం శక్తిమంతంగా తయారైందని గుర్తుచేశారు. పార్టీ నాయకురాలు పాదూరి కరుణ, నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో ‘ప్రజలతో భాజపా’ సమావేశం నిర్వహించారు. నేతలు చింతల రామచంద్రారెడ్డి, తమిళిసై సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపాకు ఓటేసి గెలిపించాలని కిషన్‌రెడ్డి అభ్యర్థించారు. అయోధ్యలోని రామమందిర నమూనాలను తమిళిసై కాలనీవాసులకు అందజేశారు. మరోవైపు మంగళవారం సాయంత్రం దోమలగూడ ఏవీ కళాశాల నుంచి చిక్కడపల్లి వరకు చేపట్టాల్సిన రోడ్‌షో వర్షం కారణంగా రద్దయింది. అప్పటికే అక్కడికి చేరుకున్న కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులనుద్దేశించి వర్షంలోనే ఐదు నిమిషాల పాటు మాట్లాడారు. పార్టీ గెలుపే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో అధికశాతం ఓటింగ్‌ నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కవాడిగూడ కార్పొరేటర్‌ రచనశ్రీ, భాజపా ఓబీసీ మోర్చా నగర అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్‌, పలువురు నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img