icon icon icon
icon icon icon

12 సీట్లు భారాసకు ఇస్తే ప్రభుత్వాన్ని శాసిస్తాం

అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టి ప్రజలు ఆగమయ్యారని, మరోసారి మోసపోకుండా లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు 10, 12 ఎంపీ సీట్లు గెలవడానికి ఓటర్లు అండగా నిలిస్తే, మళ్లీ ప్రభుత్వాన్ని శాసించే సత్తా కేసీఆర్‌కు వస్తుందని మాజీ మంత్రి, భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Published : 09 May 2024 02:53 IST

కల్వకుర్తి రోడ్‌షోలో కేటీఆర్‌

కల్వకుర్తి, న్యూస్‌టుడే: అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టి ప్రజలు ఆగమయ్యారని, మరోసారి మోసపోకుండా లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు 10, 12 ఎంపీ సీట్లు గెలవడానికి ఓటర్లు అండగా నిలిస్తే, మళ్లీ ప్రభుత్వాన్ని శాసించే సత్తా కేసీఆర్‌కు వస్తుందని మాజీ మంత్రి, భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి, అచ్చంపేట పట్టణాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అబద్ధాల హామీలిచ్చిన కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం పెద్ద అబద్ధమన్నారు. పదేళ్ల కిందట ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే, రామాలయం నిర్మించామంటూ మరోసారి ఓట్లు వేయమంటున్నారని విమర్శించారు. కృష్ణా జలాల్లో కేంద్రం మన వాటా తేల్చకుండా పెండింగ్‌లో పెట్టిందని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని వాపోయారు. చదువుకున్న నాయకుడు, బంజారాల ఇంటి అల్లుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ గిరిజన భాషలో లంబాడాలకు స్వాగతం పలికారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ఆయన ఆరోపించారు. కల్వకుర్తి  మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మిషన్‌ భగీరథ మాజీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img