icon icon icon
icon icon icon

రాష్ట్రంలో 11 వరకు అల్కా లాంబ ప్రచారం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితురాలు అల్కా లాంబ ఈ నెల 11 వరకు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Published : 09 May 2024 06:05 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితురాలు అల్కా లాంబ ఈ నెల 11 వరకు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆమె కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. 9న భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో నారీ న్యాయ్‌ సమ్మేళనంలో పాల్గొంటారు. 10న మల్కాజిగిరి, చేవెళ్లలో నారీ న్యాయ్‌ సమ్మేళనాలకు ఆమె హాజరవుతారు. చివరి రోజు 11న మీడియా సమావేశంలో మాట్లాడి ముంబాయికి తిరుగు ప్రయాణమవుతారు. కాగా బుధవారం సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన నారీ న్యాయ్‌ సమ్మేళనం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img