icon icon icon
icon icon icon

క్రిశాంక్‌ తప్పు చేసినట్లు తేలితే నేనే జైలుకెళ్తా: కేటీఆర్‌

భారాస సామాజిక మాధ్యమాల కన్వీనర్‌ క్రిశాంక్‌ అరెస్టు అప్రజాస్వామికమని, ఆయన తప్పు చేసినట్లు తేలితే తానే జైలుకెళ్తానని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 09 May 2024 06:06 IST

చంచల్‌గూడ, న్యూస్‌టుడే: భారాస సామాజిక మాధ్యమాల కన్వీనర్‌ క్రిశాంక్‌ అరెస్టు అప్రజాస్వామికమని, ఆయన తప్పు చేసినట్లు తేలితే తానే జైలుకెళ్తానని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఓయూ వసతిగృహాల మూసివేతపై దుష్ప్రచారం కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న క్రిశాంక్‌ను బుధవారం కేటీఆర్‌ కలిశారు. అనంతరం జైలు బయట క్రిశాంక్‌ భార్య సుహాసినితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌ ప్రభుత్వం క్రిశాంక్‌పై తప్పుడు కేసు పెట్టి వేధిస్తోందన్నారు. క్రిశాంక్‌ పెట్టిన సర్క్యులర్‌ ఫేక్‌ అయితే, తానే జైలుకు వెళ్తానన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న సర్క్యులర్‌ ఫేక్‌ అని తాము నిరూపిస్తే ఆయన జైలుకు వెళ్తారా అని ప్రశ్నించారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, తమకూ సమయం వస్తుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img