icon icon icon
icon icon icon

కరీంనగర్‌ సభలో మోదీ కోడ్‌ ఉల్లంఘించారు

కరీంనగర్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ తెలిపారు.

Published : 09 May 2024 06:06 IST

ఎన్నికల కమిషన్‌కు నిరంజన్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావును కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేసి దిల్లీకి పంపుతున్నారని, కాంగ్రెస్‌ గెలిస్తే అయోధ్య రామమందిరానికి తాళం వేస్తుందని ఆ పార్టీని తుడిచిపెట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారని లేఖలో నిరంజన్‌ పేర్కొన్నారు. మోదీ చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరమని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని నిరంజన్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img