icon icon icon
icon icon icon

దక్షిణాదిలోనూ భాజపా ప్రభంజనం

ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా ప్రభంజనం సృష్టిస్తుందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ ధీమా వ్యక్తం చేశారు.

Published : 09 May 2024 06:10 IST

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ

రాజేంద్రనగర్‌, మేడ్చల్‌ రూరల్‌, న్యూస్‌టుడే: ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా ప్రభంజనం సృష్టిస్తుందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలోని గగన్‌పహాడ్‌లో, మల్కాజిగిరి పరిధిలోని మేడ్చల్‌లలో బుధవారం నిర్వహించిన ‘ప్రవాసీ సమ్మేళన్‌’లలో ఆయన పాల్గొని ప్రసంగించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో రాజస్థాన్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. తెలంగాణ ప్రజలు అధిక ఎంపీ సీట్లలో భాజపాను గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం హిందూధర్మ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల కారణంగా దేశం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. విప్లవాత్మక ఆర్థిక విధానాలతో దేశంలో ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ అభివృద్ధిలో ఉత్తర భారతీయుల పాత్ర ఉందన్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని ప్రశంసించారు. మల్కాజిగిరి అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని ఈటల పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img