icon icon icon
icon icon icon

Barrelakka Election Result: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు ఎన్నంటే?

ఈసారి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిన పేరు బర్రెలక్క(కర్నె శిరీష). ఆమె నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

Updated : 04 Dec 2023 07:16 IST

మహబూబ్‌నగర్‌, న్యూస్‌టుడే : ఈసారి ఎన్నికల్లో(telangana election results) రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిన పేరు బర్రెలక్క(కర్నె శిరీష)(Barrelakka). ఆమె నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2022 డిసెంబరులో ఈ యువతి బర్రెలను కాస్తూ సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారంటూ ఆమెపై పెద్దకొత్తపల్లి ఠాణాలో కేసు కూడా నమోదయ్యింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తూ గుర్తింపు పొందారు. ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున పోటీ చేస్తున్నానని నామినేషన్‌ వేశారు. తర్వాత ఆమెకు సామాజిక మాధ్యామాల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు, వివిధ వర్గాల నేతలు వచ్చి నియోజకవర్గంలో ఆమెకు మద్దతుగా ప్రచారం చేశారు. పలువురు నిధులు కూడా సమకూర్చారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఆమెకు 5,754 ఓట్లు రాగా నాలుగో స్థానంలో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img