Rashmika: గుడ్‌న్యూస్‌ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్‌తో రెడీ

నటి రష్మిక తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశమం వచ్చినట్లు తెలిపారు.

Published : 09 May 2024 11:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరోల సరసన అలరిస్తోన్న రష్మిక తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ అందుకున్నారు. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ (salman khan) సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఆ విషయాన్ని ఖరారు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. 

‘మీరు ఎన్నో రోజులుగా నా సినిమా అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకోసమే ఈ సర్‌ప్రైజ్‌. ‘సికందర్‌’తో (Sikandar Movie) మీ ముందుకు వస్తున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని (Rashmika) పేర్కొన్నారు. ఇది ఆమె 25వ సినిమా కావడం విశేషం. తమిళ దర్శకుడు ఎ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రమే ‘సికందర్‌’. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మొదట కియారా అడ్వాణీ కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రష్మికను తీసుకున్నట్లు టీమ్‌ పోస్ట్‌ పెట్టింది. భావోద్వేగాలతో కూడిన యాక్షన్‌ చిత్రమిదని, సామాజిక అంశం కూడా ఉంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురుగదాస్‌ తెలిపారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిరు టు మహేశ్‌.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!

‘పుష్ప’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక (Rashmika mandanna) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ధనుష్, నాగార్జున ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న ‘కుబేర’లో నటిస్తున్నారు. ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ వంటి నాయికా ప్రాధాన్యమున్న సినిమాల్లో మెరవనున్నారు. వీటితో పాటు ‘పుష్ప ది రూల్‌’లో శ్రీవల్లిగా ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని