icon icon icon
icon icon icon

అరకు

అరకు లోక్‌సభ నియోజకవర్గం (Araku Lok Sabha constituency) 2008లో ఏర్పడింది.

Published : 08 May 2024 12:11 IST

లోక్‌సభ నియోజకవర్గ సమాచారం

అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో దాదాపు 450 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించిన ఈ నియోజకవర్గానికి ఒడిశాలోని పలు ప్రాంతాలు సరిహద్దులుగా ఉన్నాయి.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఏడు శాసనసభా స్థానాలు పరిధిలోకి వస్తాయి.పాలకొండ (ఎస్టీ), కురుపాం (ఎస్టీ), పార్వతీపురం (ఎస్సీ), సాలూరు (ఎస్టీ), అరకులోయ (ఎస్టీ), పాడేరు (ఎస్టీ), రంపచోడవరం (ఎస్టీ). నియోజకవర్గం మొత్తం జనాభా 21 లక్షలు. ఇందులో 57 శాతం మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఈ ప్రాంతంలో కొండ దొరలు, వాల్మీకి తెగలు ఎక్కువగా నివసిస్తారు.

ఓటర్లు: 2024 ఓటర్ల జాబితా ప్రకారం.. మొత్తం 15.39 లక్షల మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 7.47 లక్షలు, మహిళలు 7.91 లక్షల మంది.

2019 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కిశోర్‌ చంద్రదేవ్‌పై.. వైకాపా నుంచి బరిలోకి దిగిన మాధవి 2,24,089 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తెదేపా 39.94 శాతం, వైకాపా 54.76 శాతం ఓట్లు సాధించాయి.

ప్రధాన పార్టీల అభ్యర్థులు వీళ్లే!

ప్రస్తుత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ సీటు భాజపాకు వెళ్లింది. ఆ పార్టీ నుంచి కొత్తపల్లి గీత పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి చెట్టి తనూజ రాణి బరిలో నిలిచారు. గీత ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేయడం ఇది రెండోసారి. 2014లో ఆమె వైకాపా తరపున పోటీ చేసి విజయం సాధించారు. పార్టీ అధినేత జగన్‌తో పొసగక కొద్దిరోజుల్లోనే దూరమయ్యారు. 2019లో జన జాగృతి పార్టీ పెట్టినా, కొద్దిరోజులకే భాజపాలో చేరారు. గిరిజనంలో కొత్తపల్లి గీతకు మంచి పేరుండటం, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటంతో భాజపా అధిష్ఠానం ఆమెకు అవకాశం కల్పించింది.  మరోవైపు వైకాపా నుంచి గుమ్మా తనూజరాణి తొలిసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రస్తుతం ఆమె పాడేరు ఐటీడీఏలోని ఐసీడీఎస్‌ పరిధి ఎపిడిమిక్ విభాగంలో వైద్యురాలిగా కాంట్రాక్ట్‌ పద్ధతిపై పనిచేస్తున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఈ సీటును సీపీఎంకు కేటాయించడంతో పి.అప్పలనర్స పోటీ చేస్తున్నారు.

  • గత ఎన్నికల్లో అరకు నుంచి గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే..
  • 2009: కిశోర్‌ చంద్రదేవ్‌ (కాంగ్రెస్‌)
  • 2014: కొత్తపల్లి గీత (వైకాపా)
  • 2019: జి. మాధవి (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img