icon icon icon
icon icon icon

చిత్తూరు

చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం (Chittoor Lok Sabha constituency) 1952లో ఏర్పడింది.

Published : 08 May 2024 12:10 IST

చిత్తూరు లోక్‌సభ ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు. 1957లో ఇక్కడి నుంచి గెలుపొందిన మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌ లోక్‌సభ సభాపతిగా పనిచేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి కావడం గమనార్హం.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు శాసనసభా నియోజకవర్గాలున్నాయి. చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం స్థానాలు ఉన్నాయి.

ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం 16,29,218 ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 8,02,837.. మహిళలు 8,26,245.. ట్రాన్స్‌జెండర్స్‌ 136 మంది ఉన్నారు.

2019 ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసిన ఎన్‌.రెడ్డప్ప తన సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి ఎన్‌.శివప్రసాద్‌పై విజయం సాధించారు.

తాజా ఎన్నికల్లో వైకాపా నుంచి ఎన్‌.రెడ్డప్ప మరోసారి పోటీలో నిలవగా, ఎన్డీయేతో పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా దగ్గుమళ్ల ప్రసాదరావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎం.జగపతి పోటీ చేస్తున్నారు.

  • తిరుపతి లోక్‌సభా స్థానం నుంచి గెలుపొందిన అభ్యర్థులు వీరే!
  • 1952: టి.ఎన్. విశ్వనాథ రెడ్డి (కాంగ్రెస్)
  • 1957: మాడభూషి అనంతశయనం అయ్యంగార్ (కాంగ్రెస్)
  • 1962: ఎన్.జి.రంగా-స్వతంత్ర
  • 1967: ఎన్.పి. చెంగల్రాయుడు (కాంగ్రెస్)
  • 1971: పి.నరసింహారెడ్డి (కాంగ్రెస్)
  • 1977: పి.రాజగోపాల్ నాయుడు (కాంగ్రెస్)
  • 1980: పి.రాజగోపాల్ నాయుడు (కాంగ్రెస్)
  • 1984: ఎన్.పి. ఝాన్సీ లక్ష్మి (తెదేపా)
  • 1989: ఎమ్.జ్ఞానేంద్ర రెడ్డి (కాంగ్రెస్)
  • 1991: ఎమ్.జ్ఞానేంద్ర రెడ్డి (కాంగ్రెస్)
  • 1996: ఎన్.రామకృష్ణా రెడ్డి (తెదేపా)
  • 1998: ఎన్.రామకృష్ణా రెడ్డి (తెదేపా)
  • 1999: ఎన్.రామకృష్ణా రెడ్డి (తెదేపా)
  • 2004: డి.కె.ఆదికేశవులు (తెదేపా)
  • 2009: ఎన్.శివప్రసాద్ (తెదేపా)
  • 2014: ఎన్‌.శివప్రసాద్‌ (తెదేపా)
  • 2019: ఎన్‌.రెడ్డప్ప (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img