icon icon icon
icon icon icon

ఆరుగురు మంత్రుల పరాజయం

తాజా ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు మంత్రులు ఓటమిపాలయ్యారు. మంత్రివర్గంలో సీఎం కేసీఆర్‌ కాకుండా 17 మంది మంత్రులు ఉండగా... హోం మంత్రి మహమూద్‌ అలీ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, మైనింగ్‌ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి శాసనమండలి సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్నారు.

Published : 04 Dec 2023 04:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: తాజా ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు మంత్రులు ఓటమిపాలయ్యారు. మంత్రివర్గంలో సీఎం కేసీఆర్‌ కాకుండా 17 మంది మంత్రులు ఉండగా... హోం మంత్రి మహమూద్‌ అలీ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, మైనింగ్‌ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి శాసనమండలి సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్నారు. అంటే మొత్తం 14 మంది మంత్రులు పోటీ చేయగా వారిలో ఆరుగురు ఓడిపోయారు. మిగిలిన ఎనిమిది మంది గెలుపొందారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి(వనపర్తి), శ్రీనివాస్‌గౌడ్‌(మహబూబ్‌నగర్‌), కొప్పుల ఈశ్వర్‌(ధర్మపురి), ఎర్రబెల్లి దయాకర్‌రావు(పాలకుర్తి), ఇంద్రకరణ్‌రెడ్డి(నిర్మల్‌), పువ్వాడ అజయ్‌కుమార్‌(ఖమ్మం)లు పరాజయం చెందారు.

ఇంద్రకరణ్‌రెడ్డి భాజపా అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి చేతిలో ఓటమి చెందగా... మిగిలిన వారిని కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓడించారు. ఎర్రబెల్లి, కొప్పుల ఇద్దరూ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత తొలిసారి పరాజయం చెందటం గమనార్హం. మంత్రి నిరంజన్‌రెడ్డి తన అనుచరుడైన తూడి మేఘారెడ్డి చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. ఇక కేటీఆర్‌(సిరిసిల్ల), హరీశ్‌రావు(సిద్దిపేట), తలసాని శ్రీనివాస్‌యాదవ్‌(సనత్‌నగర్‌), సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), చామకూర మల్లారెడ్డి(మేడ్చల్‌), ప్రశాంత్‌రెడ్డి(బాల్కొండ), జగదీశ్‌రెడ్డి(సూర్యాపేట), గంగుల కమలాకర్‌(కరీంనగర్‌)లు మరోసారి విజయం సాధించారు. హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌లు భాజపా అభ్యర్థులను ఓడించగా... మిగిలిన అయిదుగురు కాంగ్రెస్‌ అభ్యర్థులపై విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img