Kamal Haasan: వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్‌ హాసన్‌

ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్‌.

Published : 27 Apr 2024 16:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్ శ్రుతి హాసన్‌  ‘ఇనిమేల్’ (Inimel) పేరుతో స్పెషల్‌ సాంగ్స్‌ను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా ‘ప్రేమ వారసత్వం’ పేరుతో మరో పాటను విడుదల చేయనున్నారు. దీనికి కూడా కమల్‌ హాసన్‌ (Kamal Haasan) సాహిత్యాన్ని అందించారు. తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని ఇందులో చూపనున్నారు.  ఈసందర్భంగా విడుదల చేసిన ఓ వీడియోలో కమల్‌హాసన్‌, శ్రుతిల (Shruti Haasan) సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

‘‘ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టం. అది ఎంత అందంగా మొదలవుతుందో ఒక్కోసారి అంత భయంకరంగా ముగుస్తుంది. దానికోసం పోరాడుతూనే ఉండాలి. నేను చాలా సంప్రదాయాలు, సామాజిక పరిమితులను సులువుగా వదులుకోగలిగాను. కానీ, ప్రేమను వదులుకోలేకపోయాను’ అని చెప్పారు. ఆ తర్వాత శ్రుతిహాసన్‌ మాట్లాడుతూ.. ‘నన్ను అందరూ నాన్న కూచి అంటారు. ఆయన అందరిలా నన్ను పెంచలేదు. ఎప్పుడూ ఫోన్‌ చేయరు. నన్ను మిస్‌ అవుతున్నట్లు డైరెక్ట్‌గా చెప్పరు. చిన్నపిల్లలు వారి తండ్రులతో ఉండే రీల్స్‌ పంపుతారు. వాటిని చూసి నాన్న నన్ను మిస్‌ అవుతున్నారని నేను అర్థం చేసుకుంటాను. ఆయన అంగీకరించనప్పటికీ నాకు కోపం ఆయన నుంచి వచ్చిందే. ఆయనతో కలిసి ఒక కామెడీ చిత్రంలో చేయాలని ఉంది’ అని కోరారు.

‘ఇనిమేల్’ మొదటి పాటలో శ్రుతిహాసన్‌ స్టార్‌ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో కలిసి నటించారు. అది మంచి ప్రేక్షకాదరణ పొందింది. దంపతుల మధ్య ఉండే బంధాన్ని ఇందులో నాలుగు నిమిషాల్లో చూపించారు. ఆ పాటలో వాళ్లిద్దరి కెమిస్ట్రీ బాగుందని కామెంట్లు వినిపించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు