icon icon icon
icon icon icon

ఎన్నికల బరిలో రాజులు, రాణులు

ఒడిశాలో రాజులు, రాణులకు ఆదరణ తగ్గలేదు. ప్రతిసారీ ఎన్నికల్లో కొందరు బరిలో దిగుతున్నారు. ఓటర్లు వారిని గెలిపించి చట్టసభలకు పంపుతున్నారు. లోక్‌సభ, శాసనసభలో వారి ప్రాతినిధ్యం కొనసాగుతోంది.

Updated : 22 Apr 2024 06:35 IST

ఒడిశాలో ప్రతిసారీ ఆదరిస్తున్న ఓటర్లు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశాలో రాజులు, రాణులకు ఆదరణ తగ్గలేదు. ప్రతిసారీ ఎన్నికల్లో కొందరు బరిలో దిగుతున్నారు. ఓటర్లు వారిని గెలిపించి చట్టసభలకు పంపుతున్నారు. లోక్‌సభ, శాసనసభలో వారి ప్రాతినిధ్యం కొనసాగుతోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ కొందరు రాజులు, రాణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


ఐదోసారి సంగీత

లంగీర్‌ రాణి సంగీతా కుమారి సింగ్‌దేవ్‌ భాజపాలో అగ్ర నాయకురాలు. ఆమె నాలుగు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి మళ్లీ ఆ పార్టీ అభ్యర్థిగా బలంగీర్‌ బరిలో ఉన్నారు.


అసెంబ్లీ అభ్యర్థిగా సంగీత భర్త

సంగీత భర్త బలంగీర్‌ రాజు కనకవర్ధన్‌ సింగ్‌దేవ్‌ పాట్నాగఢ్‌ అసెంబ్లీ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పాట్నాగఢ్‌ నుంచి మూడు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగానూ గతంలో పని చేశారు.


మాజీ ఎంపీ ఈసారి అసెంబ్లీకి..

లంగీర్‌ రాజ కుటుంబానికి చెందిన యువరాజు కాళికేష్‌ నారాయణ్‌ సింగ్‌దేవ్‌ గతంలో ఒకసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. గత  ఎన్నికల్లో బిజద అభ్యర్థిగా పోటీచేసి తన పిన్ని సంగీత చేతిలో ఓడిపోయారు. ఈసారి కాళికేష్‌ బలంగీర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.


కలహండి నుంచి మాళవిక

లహండి జిల్లా భవానీపట్నా రాజ ప్రసాదానికి చెందిన రాజు అర్కకేసరి దేవ్‌ గతంలో బిజద అభ్యర్థిగా కలహండి నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో భాజపా అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తర్వాత భార్య రాణి మాళవిక దేవితో కలిసి కమల దళంలో చేరారు. ఈసారి భాజపా కలహండిలో మాళవికను అభ్యర్థిగా నిలిపింది.


ఒళి నుంచి ప్రతాప్‌ మళ్లీ..

ప్రస్తుత పరిశ్రమలు, విద్యుత్తుశాఖల మంత్రి కేంద్రపాడా జిల్లా ఒళి ప్రాంత రాజు ప్రతాప్‌దేవ్‌. ఆయన వరుసగా మూడు సార్లు ఒళి నుంచి బిజద అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఈసారి మళ్లీ అదే పార్టీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు.  


తల్లి స్థానంలో కుమారుడు

గంజాం జిల్లా చికిటి రాణి ఉషాదేవి బిజద అభ్యర్థిగా వరుసగా ఐదుసార్లు పోటీ చేసి గెలిచారు. నవీన్‌ మంత్రివర్గంలో ప్రస్తుతం ఆమె పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. వయో భారం, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో తన కుమారుడు యువరాజు చిన్మయానంద శ్రీరూప్‌ దేవ్‌ను బిజద అభ్యర్థిగా చేశారు. కుమారుడి తరఫున తల్లి ప్రచారం చేస్తున్నారు. చికిటిలో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నందున ప్రచారానికి పాటలను తెలుగులో రికార్డు చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img