icon icon icon
icon icon icon

Harish Rao: అబద్ధాల కాంగ్రెస్‌ను శిక్షించాల్సిందే: హరీశ్‌రావు

ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందని, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Published : 04 May 2024 15:44 IST

హైదరాబాద్: ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందని, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆరింటిలో ఐదు హామీలు అమలు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, అందంతా అబద్ధమని అన్నారు. బషీర్‌బాగ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన బాండ్‌ పేపర్‌ బౌన్స్‌ అయ్యిందన్న ఆయన.. ఆ పార్టీని ఈ ఎన్నికల్లో శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. 

సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రం పరువు తీస్తున్నాయని విమర్శించారు. ఆయన మాటల్లో పగ, ప్రతీకారమే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.‘‘ భారాస హయాంలో పంటకు పెట్టుబడి సహాయాన్ని సకాలంలో అందించాం. కానీ, ఇప్పుడు పంట చేతికొచ్చినా, పెట్టుబడి సాయం మాత్రం రైతులకు అందడం లేదు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 80 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేవి. కానీ, ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులకే మొగ్గు చూపుతున్నారు. గతంలో నీటి కొరత, కరెంట్‌ కోత అనే పదాలే వినిపించేవి కాదు. నీటి కష్టాలు, కరెంట్‌ కోతలు అప్పుడే మొదలయ్యాయి’’ అని హరీశ్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img