icon icon icon
icon icon icon

TS Elections: ఆదర్శంగా నిలిచిన సంగాయిపేట.. అక్కడ 100 శాతం పోలింగ్‌

ఓటింగ్‌లో మెదక్‌ జిల్లాలోని సంగాయిపేట తండా వాసులు ఆదర్శంగా నిలిచారు. కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100శాతం పోలింగ్‌ నమోదైంది.

Published : 13 May 2024 21:32 IST

మెదక్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్‌లో మెదక్‌ జిల్లాలోని సంగాయిపేట తండా వాసులు ఆదర్శంగా నిలిచారు. కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ తండాలో మొత్తం 210 ఓట్లు ఉన్నాయి. అందులో 95 మంది పురుషులు ఉండగా, 115 మంది మహిళలున్నారు. వారంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 100 శాతం పోలింగ్‌ నమోదు కావడంతో ఆ తండా ప్రజలను జిల్లా కలెక్టర్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img