icon icon icon
icon icon icon

Kc Venugopal: ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు: కేసీ వేణుగోపాల్‌

ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు.

Published : 07 May 2024 14:51 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. పార్టీ నేతలతో దిల్లీ నుంచి కాన్ఫరెన్స్‌లో కేసీ వేణుగోపాల్‌ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. హాజరుకాని నేతలపై కేసీ వేణుగోపాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సికింద్రాబాద్ పార్లమెంట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మంత్రి కోమటిరెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలోనే ఉండి అభ్యర్థిని గెలిపించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సమన్వయంలో విఫలమయ్యారని మహేశ్‌ కుమార్‌గౌడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి దిశ.. దశ మార్చే ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో అధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నామని, మరింత ఉత్సాహంతో పనిచేయాలని నేతలకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న రైతుబంధు నిధులు జమచేసినట్టు పార్టీ నేతలు వివరించారు. త్వరలో రుణమాఫీ చేయనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలపై నిర్లక్ష్యం లేకుండా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని కేసీ వేణుగోపాల్‌ సూచించారు. భేటీకి గైర్హాజరైన నేతలపై నివేదిక ఇవ్వాలని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img