icon icon icon
icon icon icon

Kishan Reddy: అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌.. దేశ భద్రత అంశం: కిషన్‌రెడ్డి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆడియో, వీడియో మార్ఫింగ్‌ దేశ భద్రతకు సంబంధించిన అంశమని భాజపా తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 29 Apr 2024 19:06 IST

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆడియో, వీడియో మార్ఫింగ్‌ దేశ భద్రతకు సంబంధించిన అంశమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డి మాటలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందన్నారు. హైదరాబాద్‌ కేంద్ర పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

‘‘సీఎం స్థాయిని రేవంత్‌రెడ్డి దిగజార్చుతున్నారు. రిజర్వేషన్ల ఆరోపణలతో ఆయన తన విశ్వనీయత కోల్పోయారు. సీఎంగా రేవంత్‌.. ప్రతిపక్షనేతగా కేసీఆర్‌ ఉండటం తెలంగాణ ప్రజల కర్మ. కృష్ణా జలాల వాటాల్లో 299 టీఎంసీలపై సంతకం పెట్టింది కేసీఆర్‌ కాదా? కేంద్రంలో హంగ్‌ వస్తుంది.. చక్రం తిప్పుతానని కేసీఆర్‌ కలలు కంటున్నారు. సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ఆయన.. దిల్లీలో చక్రం తిప్పుతాననటం హాస్యాస్పదంగా ఉంది. రిజర్వేషన్లు ఎత్తివేస్తారు.. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని కాంగ్రెస్‌, భారాస కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి’’అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్లు తీసివేసేది లేదని ఆర్‌ఎస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా స్పష్టం చేశారని గుర్తు చేశారు.  

భాజపాలో చేరిన నేతలు

కేంద్రమంత్రులు మురుగన్, కిషన్ రెడ్డి సమక్షంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు భాజపాలో చేరారు. సంక్షేమ పథకాల అమలు, దేశాభివృద్ధి కోసం నరేంద్ర మోదీ అహర్నిశలు కృషి చేశారని, ఆయన్ను మూడోసారి ప్రధాని చేయడం కోసం భాజపాలో చేరినట్లు వెంకటేష్ నేతకాని, పెద్దిరెడ్డి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img