icon icon icon
icon icon icon

KTR: మోదీతో పోరాటం రాహుల్‌గాంధీ వల్ల కాదు: కేటీఆర్

భాజపా ప్రభుత్వం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని యత్నిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు.

Published : 09 May 2024 14:59 IST

హైదరాబాద్‌: భాజపా ప్రభుత్వం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ప్రయత్నిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. అలా జరిగితే చిన్న పనుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని, అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాడాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌ నేతలు దిల్లీకి గులామ్‌గిరీ చేస్తున్నారని మండిపడ్డారు. 

‘‘రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోంది. రాజ్యాంగాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. భాజపాతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. కొన్ని చోట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వాలను కాషాయ పార్టీ పడగొట్టింది. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టాలని చూశారు. మా ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించారు. తెలంగాణలో వారి ఆటలు సాగలేదు. రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలి. ఆరు నెలల్లో భారాస తెలంగాణ రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది. మోదీతో పోరాటం రాహుల్‌గాంధీ వల్ల కాదు’’ అని కేటీఆర్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img