icon icon icon
icon icon icon

Kavitha: అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు: ఎమ్మెల్సీ కవిత

భారాస ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Updated : 25 Nov 2023 12:45 IST

కోరుట్ల: భారాస ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పింఛను రూ.వెయ్యికి పెంచామని.. ప్రస్తుతం రూ.2వేలు అందిస్తున్నామన్నారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం పింఛను అందజేశామని తెలిపారు. 

మరోసారి భారాస అధికారంలోకి వస్తే రూ.3వేల పింఛను ఇస్తామని.. అక్కడి నుంచి ఏటా రూ.500 పెంచుకుంటూ ఐదేళ్లలో రూ.5వేలకు పెంచుతామని కవిత వివరించారు. బీడీ కార్మికులకూ రూ.3వేల పింఛను అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న తరహాలో రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ బీమా పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఏదైనా కారణంతో కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి బీమా మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపారు. మరోసారి భారాస అధికారంలోకి వస్తే గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కే అందిస్తామని.. రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని కవిత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img