Fire Accident: ఆలిన్‌ హెర్బల్‌ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్‌ హెర్బల్‌ పరిశ్రమలో మళ్లీ మంటలు వ్యాపించాయి.

Updated : 27 Apr 2024 16:56 IST

నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్‌ హెర్బల్‌ పరిశ్రమలో మళ్లీ మంటలు వ్యాపించాయి. మరోసారి భారీ శబ్దాలతో రసాయన డ్రమ్ములు పేలాయి. దీంతో మంటలు చెలరేగాయి. రెండు అగ్నిమాపక యంత్రాలతో వాటిని ఆర్పుతున్నారు. పరిశ్రమ పరిసర ప్రాంతాలకు సిబ్బంది ఎవరినీ అనుమతించడం లేదు. శుక్రవారం సాయంత్రం వెల్డింగ్ చేస్తుండగా ఈ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం వరకూ ఈ మంటలను ఆర్పగా.. తాజాగా మళ్లీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు